The following Post features a Poem spotlighting the Cultural Talent of @nasa_manasa.
The latest addition to our Articles on Andhra Talent is a return entry by ACP favourite Nasa Manasa.
Readers may recall the previous Poetry selections of a young talent named Manasa, titled Maanasa Manasa Kavitalu. Today we present the third selection of her efforts, in the form of the following Poem.
ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవచ్చు మన మానస ప్రథమ కవిత ఇక్కడ ప్రచురించాము. ఈవాళతన తృతీయకవిత ప్రయత్నం
§
తెర దించని వీధి నాటకాలు
తెర దించేవరకు విరమించని వీధి నాటకాలు నాటకాల వేదికంతా ప్రతిధ్వనించే వాద ప్రతివాదాలు అవేమో తెరదించే వరకు విరమించని వీధి నాటకాలు
నాటకాల సంతలో బేరాలాడే జనాలు కొందరైతే వెంబడించే భ్రాంతి బతుకుల్లో మరికొందరు అరుపులే అరుపులు అలిసిపోయే అత్యాశల కాంతులు అవేమో తెర దించేవరకు విరమించని వీధి నాటకాలు
ఈ జనారణ్యపు భవంతుల నీడల్లో నాటకం పొడవునా ఓ సారి ఆర్తనాదాలు ఇంకోసారి హర్షధ్వానాలు పాపం ఎందులోను ఏమీ దొరక్క ఇంకేదానికోసమో పరుగులేపరుగులు అవేమో తెరదించే వరకు విరమించని వీధి నాటకాలు
చెవులకు ఇంపు లేని శబ్దాలు నిశబ్దాల కోసం దశాబ్దాల శతాబ్దాలు … నిలబడని అబద్ధాలన్నీ అర్థాపర్థం లేకుండా చూపించే అద్దాలలా చూపు మొత్తం మొద్దై మధ్య నిలబడనీక ఎవరికెవరికో పిలుపులందుతాయి ఆ వచ్చే వారెవరో మాటలు పోగెయ్యడం మరచిపోతారు అవేమో తెర దించే వరకు విరమించని నాటకాలాయె
నాటకాలలో ఆకతాయి ఆటలేమిటో భయం గుప్పిట్లో బంతులాటలట పిడికిలి ఊపుకే మట్టైపోయే ఎర్రటి ముద్దలంట అవేమాటలో ఏమో ? ముల్లులేరలేమనుకునే మూగ జీవులు ఆదుకోమంటారు …
ఎందుకో మరి ఆశల శ్వాసలు బిగబట్టి ముగిసిపోయే పాత్రలలా ఎదురు చూస్తారు అవేమో తెరదించే వరకు విరమించని నాటకాలాయే
నేను నిలబడలేనే ఆ అసంతృప్త పాత్రల నడుమ
దశదిశలా ధిక్కారపు నిబంధనలే
వదిలెల్తా ఓ నిశబ్దం లోకి లయబద్ద నిశబ్దాలను తట్టిలేపే ఓ నాటకం చూడటానికి
§
Disclaimer: This article represents the opinions of the Author, and should not be considered a reflection of the views of the Andhra Cultural Portal. The Author is responsible for ensuring the factual veracity of the content, herein.