Talent: రసమయంగా ఉండాల్సిన నీ హృదయం

The following Post features a Poem spotlighting the Cultural Talent of @nasa_manasa.


Along with understanding our culture as it was, is the need to build upon it by giving patronage to the future. Continuing our Series on Andhra Cultural Talent is another work by a returning guest contributor.

Readers may recall the previous Poetry selections of a young talent named Manasa, titled Maanasa Manasa Kavitalu. Today we present the second selection of her efforts, in the form of the following Poem.

ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవచ్చు  మన మానస ప్రథమ కవిత ఇక్కడ ప్రచురించాము. ఇవాళ తన ద్వితీయ కవిత ప్రయత్నం.
§
రేపటి చరిత్ర నా మనసు లో లేదంటే
నేడు మిగిలిన ఆ చివరి క్షణం లోపు
రంగుల లోకం నా కన్నులు తొడగాలని  
ఆఖరి లక్ష్యం అందుకోలేని తెలిసిన
అందుకున్నాని నమ్మిస్తూ ,
ఎదో చెప్పాలన్న ఆత్రం
గొంతు నరాలనుండి రాగాలుగా పైకి వస్తుందనుకున్నా
అందమైనది నిజం కాదని తెలిసినా
అందుకోవాలని ప్రయత్నం
తెరలు  లేని ఆ చిరునవ్వు
నీలో చూడాలనుకున్నా
నా కుటుంబం అనే ఈ ప్రపంచం
రంగస్థలంపై నిజంగానే నటిస్తోంది
నాది అందులో ఓ పాత్ర లేదా
ప్రేక్షక పాత్ర …!

 

రసమయంగా ఉండాల్సిన నీ హృదయం
నాకు నచ్చక మిగిలిన భావాలుగా మారి
నా అనుమతి కోసం నిరీక్షించిన కనికరించలేను
అందమైన పువ్వు ఎన్నటికీ వాడకూడదు అనుకుంటా
నలిగిపోతే నేనేమి చేస్తా
నలిగిన పువ్వు వాడలేక దానివంక చూడటమే మానేశా
కానీ దాని పరిమళం నన్ను వెంటాడుతూనే వుంది
కాలంతో పాటు నా నడక ఈ నేలపై సాగుతోంది
ఆ దారిలో ఎదురైనా ప్రతివారు
‘నిన్ను ఎక్కడో చూసినట్టుంది అని
నవ్వుతు నాతో అంటారని ఆశ
ఎవ్వరు ఒకేలాంటి జీవితం గడపలేరు
ఏమిటో బతకడానికి ఎన్ని అడ్డంకులో
నన్ను దాటి పరిగెడుతుంటారు
ఇప్పుడు నేను వారిలో ఒకరిని కాదు
ఈ నేల కు తెలియదు రాలే నీటి బిందువులు
నా కన్నీరని
 

flaming heart

ఓ హరివిల్లు ను నా కంటికి ఓ చల్లని మెరుపులా
నన్ను చుట్టింది కానీ నాకు తెలుసు
ఆ క్షణం దాటితే తనలో కలిసిపోతే అని
అంత వరకు ఈ ప్రకృతి నేను చెప్పినట్టు
వింటుందని చిన్న ఆశ
అద్దం లో న రూపు అపద్దం
ఇంచు అయినా మార్చలేను
అందుకే ఆ అద్దని నెలకు బాదేశాను
కిటికీ లో కనిపిస్తున్న ఈ వింత ప్రపంచం
మార్చలేకున్నా
మారుతుందని భ్రమిస్తూ పయనిస్తా కొత్త లోకానికి

 

§

 


 Disclaimer: This article represents the opinions of the Author, and should not be considered a reflection of the views of the Andhra Cultural Portal. The Author is responsible for ensuring the factual veracity of the content, herein.