Talent: అంతరంగం

The following Post features a Poem spotlighting the Cultural Talent of @nasa_manasa.


The latest addition to our Articles on Andhra Talent is a return entry by ACP favourite Nasa Manasa.

Readers may recall the previous Poetry selections of a young talent named Manasa, titled Maanasa Manasa Kavitalu. Today we present the fourth selection of her efforts, in the form of the following Poem.

ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవచ్చు  మన మానస ప్రథమ కవిత ఇక్కడ ప్రచురించాము. ఈవాళ తన నాలుగో
కవిత ప్రయత్నం.
§
అంతరంగం
తరంగం
ఒక నిశ్శబ్ద అంతరంగం
మదిన చేరే
ఒక్కో జ్ఞాన ప్రకంపనం
తనలోని తన విశ్వాన్ని
తడిపే ఓ మధురాంతరంగం
అణువణువును
ఆడిస్తున్న లయాంతరంగం
చీకటి ధైన్యాన్ని
వధించే ఓ ప్రేరణాంతరంగం
భావాలతో బంధాలను
కలిపే ఓ మౌనాంతరంగం
రంగుల కళను
రంగరించే వర్ణాంతరంగం
దైవత్వపు ఏకత్వాన్ని చాటేది
కూడా ఈ విశ్వానంతరంగమే
తరంగం
ఓ నిశ్శబ్ధా తరంగమే
కదలిక రేపిన ఓ చేతనం అయ్యింది

flaming heart

§
నాలోన తను
 మదిలో గదిలో
అతని తలపులలో నేను
గది తలుపులు తెరిచాక
ఎదురుగా తను
ఏమని తెలుపను
మదిలోని భావాలను
తాను నావైపు చూస్తుంటే
ఆ ఉదయించే సూర్యుడు
వికసించే పువ్వుకోసం
ఎదురు చూసినట్టు
సెలయేరే
పిల్లకాలువ కోసం పరిగెత్తినట్టు
కురిసే వానకోసం
ఎదురు చూసిన మట్టిలా
కూసే కోయిల కోసమో
చిగురించే ఆశాలకోసమో
నిత్య వసంతంలా నిలచిపోయినట్టు
తానెంతటి సంద్రం అయినా
నా కలల తీరంలో
అలలై ఎగసిపడుతున్నట్టు
వేల తారకాల నడుమ
పున్నమి వెన్నెల కోసం
ఎదురుచినట్టు
తను నన్నలా వుండిపొమ్మంటాడా
§
యేండ్ల నుండి కొన్ని విష వృక్షాలు పెంచుతున్నారు…
మనిషి మనసు లోతుల నుంచి…
అవి ఏటికేడు విరగగాసి…
విస్తరిస్తున్నాయి…
ఏటికేడు ఎవరికీ వారే కుళ్లిపోతున్నారు…
కారణాలు వెతుక్కోకుండా
వేళ్ళుతో సహా పీకి పారెయ్యాలన్న…
యోచన లేకో తెలియకో…
§

 

 Disclaimer: This article represents the opinions of the Author, and should not be considered a reflection of the views of the Andhra Cultural Portal. The Author is responsible for ensuring the factual veracity of the content, herein.