MY MESSAGE to my Wife, Vani:
VANI+CHANDRA = 38 years of happy living.
Traveling in Italy. Our life has been an arduous journey through lakes and rocks.
We might have covered tens of thousands of miles in various countries.
WAITING FOR THE CALL
SHE TURNS 60 (Shashti Poorthi on 30th June.) My gift to her, 200 poems.
If you have liked the selections from Vani Satakam, you can purchase the full 200 (Dvisathi) next month July 27,2015. Fourth and last free selection is below. Hope you enjoy. Thank you.
100.
భాష స్వచ్చమున్న భావము స్వచ్చము
వినగ సొంపు వివిధ భారతి గదె
క్రొత్త పుంత తొక్కె కొంగొత్త గొంతులు
వాణి బలుకు మాట నాదు నోట!
తాత్పర్యము (తా):
ఎన్ని ఎఫ్ ఎం చానెళ్ళొచ్చినా వివిధ భారతిని మించిన రేడియో చానెల్ లేదు కదా. వారి భాష స్వఛ్ఛంగా ఉంటుంది, భావమూ స్వఛ్ఛంగా ఉంటుంది. సంకర భాషకు స్థానమే లేదు. విన సొంపుగా ఉండే వివిధ భారతి కల కాలం శ్రోతలకు వీనుల విందు చేయాలని నా కోరిక.
English:
Many FM channels have come to air programs. But, Aakaash Vaani, Vividh Bhaarati stands apart. The language of the anchors is pure, their thoughts are unadulterated. There is no scope for adulterated language. Hope Vividh Bharati entertains the listeners forever after.
101.
తండ్రి బోయి నేడు దశాబ్దము లవగ
గుఱుతు కొచ్చె వారి గతము నేడు
బ్రతికి యుండ ఎపుడొ బిండము బెట్టెదో
వాణి బలుకు మాట నాదు నోట!
తాత్పర్యము (తా):
కొంతమంది సుపుత్రులు, తండ్రి పోయిన దశాబ్దాల తరువాత నూరేండ్ల పండుగనో, ఆయన పేరుతో అన్నదానం చేస్తున్నామనో ప్రచారానికి పెద్ద, పెద్ద బొమ్మలు పెట్టి ఆర్భాటం చేస్తారు. నిజానికి వీళ్ళు ఆయన బ్రతికుండగానే వృద్ధాశ్రమంలో చేర్చో, సూటి పోటి మాటలతోనో పిండం పెట్టినంత పని చేస్తారు.
English:
Some children make a vanity show with large pictures of their parents decades after their death in the name of centenary celebrations or charity shows. But, the fact is, when they were alive these children would have harassed them or left them in old age homes to fend for themselves.
103.
నీట నుండు చేప నీట నుండగ నీక
వలను వేసి తీసి వాస నందె
మత్స్య ముండు నీటె ముత్య ముండును గద
వాణి బలుకు మాట నాదు నోట!
(దుర్మార్గుడని తెలిసి కదిలించి, కవ్వించి వాడు నన్ను తిట్టాడు బాబోయ్ అని పెళ్ళాం దగ్గరేడిస్తే ఊరుకో పిరికి వెధవా అంటుంది. చేపలు పట్టడమెందుకు. వాసన అని ఏడ్చుడెందుకు. అదే సముద్రంలో ముత్యాలుంటాయి, వాసన రావు. ఓపిగ్గా కూర్చుని పట్టు కొమ్మని సారాంశము. చేపల్ని వాటి మానాన వదిలెయ్యి. నచ్చిన వారు పట్టుకుంటారు).
తాత్పర్యము (తా):
నీటిలో బ్రతికే చేపను నీటిలోనే ఉండనీక, వల వేసి పట్టుకొని, వాసన చూసి “పాడు వాసన” అని తిట్టుకోవడమెందుకు? దానిని నీటిలోనే బ్రతకనీయ వచ్చు, లేదా ఆ వాసన నచ్చే వాడినే పట్టుకోనియ్య వచ్చు కదా? (అనవసర విషయాలు మాట్లాడి అవతలి వాడు ప్రతిస్పందిస్తే బాధ పడటం దేనికి?)
English:
An advice to those who pick up quarrels without reason and then if the other person reacts cry their hearts out. Why should one catch the fish that is playing in water, smell it and say it is bad smelling and blame it? You can let it live in water or allow it to be caught by the one who likes the smell.
105.
అహంభావ మన్న యది యెటులన్నరో
మాట కటువు కాని మనసు తీపి
వేము చేదు మార మందాకు గాదటె
వాణి బలుకు మాట నాదు నోట!
తాత్పర్యము (తా):
కేవలం మాట కరుకుగా ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తిని అహంభావి అని ఎలా చెప్ప గలం? అతని మాట కరుకుగా ఉన్నా మనసు వెన్న లాగా మెత్తగా ఉండొచ్చు కదా? వేప ఆకు తింటే చేదుగా ఉంటుంది. కానీ దాని లోపల ఎన్ని ఔషధ గుణాలుంటాయి?
తాత్పర్యము (తా):
( మందాకు యనగా herbalplant) తత్వము మారిన మనిషిని విమర్శించడం సబబా అనేది ఈ పద్య సారాంశము)
English:
We can not brand a person arrogant simply because he talks harsh. His heart might be soft like butter. Is not the neem leaf that is bitter a useful medicine with many good qualities?
106.
చిన్న తనపు బొమ్మ చెప్పును కధలను
చిత్త మెట్లు మారు చెప్పు టెట్లు
వేచి యున్న బండి వేగ మెట్లు దెలియు
వాణి బలుకు మాట నాదునోట!
(చిన్న తనపు బొమ్మలు nostalgia కాదు .ఈ రోజు గుణం ప్రధానము అని సారాంశము)
తాత్పర్యము (తా):
చిన్న తనంలో మనం తీసుకున్న, గీసుకున్న చిత్రాలు ఎన్నో తీపి గురుతులతో కూడిన కధలు చెప్తాయి. కాని వయసు పెరిగిన కొలదీ గుణం ఎలా మారిందో చెప్పాలంటే ఇప్పటి ప్రవర్తనే రుజువు కదా?
English:
The photos we take, the selfies we painted during childhood tell many a story, that we call nostalgia. But, who knows how each changed in his character as he grows up. For that the bench mark is his present behaviour only.
107.
పేరు గొప్పదిబ్బ యూరు యనునటుల
వృక్ష మేమి జెప్పు వంశ యశము
తాత నేయి నాక మూతి వాసన జూతె
వాణి బలుకు మాట నాదు నోట!
తాత్పర్యము (తా):
మా తాతలు నేతులు నాకారు, మా మూతులు వాసన చూడండి అన్నట్లుగా వంశ వృక్షం చూస్తే వంశం గొప్పతనమెలా తెలుస్తుంది? What are you at present is more important.
English:
Our ancestors were royal. They were eating food in gold plates. This is what the “Family Tree” tells. It is not nostalgia. What are you at present is more important.
111.
బతికి చెడిన వాడు బతికించు ఇతరుల
చెరచి బతుక నెంచ చేరు యముని
చీమ కుట్ట గానె చేరదె కాలుని
వాణి బలుకు మాట నాదు నోట!
తాత్పర్యము (తా):
బాగా బ్రతికి జీవితంలో దెబ్బ తిన్న వాడు ఇతరులకు సహాయం చేసి బ్రతికించడానికి ప్రయత్నిస్తాడు. ఇతరులను చెరిచి బ్రతకాలనుకునే వాడు త్వరగా యముణ్ణి చేరుకుంటాడు. చీమ కుట్టగనే చచ్చి పోతోంది కదా?
A person who lived a luxurious life and fell from grace, tries to help the needy as he knew the pitfalls. The person who wants to enjoy at others’ misery will soon reach hell. Does the ant that bites not die instantly?
115.
సోదర బ్రేమ బోయి స్వార్ధమ్ము నిండగ
బయటి వారి నడుమ పల్చనవరో
మిత్ర భేద కధను మరచితి రెటులయా
వాణి బలుకుమాట నాదు నోట!
తాత్పర్యము (తా):
సోదరుల మధ్య ప్రేమ నశించి, ఎప్పుడైతే స్వార్ధం పెరుగుతుందో, అప్పుడు బయటి వారి ముందు చులకన అవుతారు కదా! “మిత్ర భేదము” కధ మరిచి పోయారా?
English:
If the natural love between siblings gives place to extreme selfishness, the whole lot becomes laughing stock in front of others. Did they forget the “Mitra Bhedamu” (dissension between friends) panchatantra moral story?
121.
దోశ వడ ఇడ్లి తినవయ దక్షిణాన
పావు వడ భాజి తినవయ పశ్చిమాన
వెన్న రోటిని తినవయ వుత్తరాన
తేట బలికెను ఈ బాణి నాదు వాణి!
తాత్పర్యము (తా):
భారత దేశం అనేక రుచుల, అబిరుచుల సంస్కృతుల సమ్మేళనం. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రుచి. దక్షిణానికి వెళ్తే, దొస, ఇడ్లీ, వడ, పశ్చిమాన రుచికరమైన పావు, భాజీ, వడ, ఉత్తరాన వెన్న రొట్టె (నాన్) దొరుకుతాయి. కానీ మళ్ళీ ఇవన్నీ దేశంలో అందరూ ఆదరించే వంటకాలే.
English:
India is a country with differing tastes and cultures, but unified as a nation. If you go South you get recipes of Idly, Vada, Dosa the delicious, in the West you get Pav, Vada, Bajee very tasty, in the North you get delectable, soft naan (roti) with butter. But, the whole population relishes these dishes.
122.
లఘువు తీసి దీర్ఘము గురులాయె మనకు
ప్రాస వాడెడి బోయీడు పరగె యతిగ
లఘువు గురువులు యతి ప్రాస లయ్యె పదము
తేట బలికెను ఈ గీతి నాదు వాణి!
ఇచ్చట ప్రాస యనగా ఈటె, పదము పాదమునకు రూపాంతరము. యతి వాల్మీకి.
తాత్పర్యము (తా):
లఘువు దీర్ఘము తీసి గురువుగా మారింది. (శిష్యుడు విద్య నేర్చి గురువు అయినట్లుగా) ప్రాస (ఈటె) వాడే వాల్మీకి యతి అయ్యాడు. లఘువు, గురువు, ప్రాస, యతి యే కదా, పద్య పాదానికి మూలము?
There is no English translation as it is poem with jugglery of words in Telugu.
126.
బిడ్డ (ఆడపిల్ల) పుట్టిన దీపము బెట్టు నౌగ
వారసుడు బుట్ట దీపము వూదు దేల
ఏలమారెను నా జాతి యిట్టి రీతి
తేట బలికెను ఈ గీతి నాదు వాణి.
తాత్పర్యము (తా):
ఆడ పిల్ల పుడితే ఇంట్లో దీపం పెడుతుంది కదా? వారసుడు పుట్టాడని పుట్టిన రోజున దీపమార్పే సంస్కృతి ఎక్కడనుంచి వచ్చింది? మన సంస్కృతికి ఏమి అయ్యింది?
English:
If a girl child is born, she will light the lamp in the house. Why are we putting out candles when a baby boy is born? What happened to our culture?
140.
బద్ధకమ్ము నీది బెద్ద వారి ననకు
నీకు వచ్చు విద్య నీవు నేర్వు
జాత కర్మ గలియు ననుచు కూర్చొన బోకు
వాణి బలుకు మాట నాదు నోట!
తాత్పర్యము (తా):
నీ సోమరి తనానికి నువ్వు చదువుకోకుండా, విద్యా వ్యవస్థని, నీ పెద్ద వారిని, గురువులనూ తిడుతూ కూర్చుంటే ఫలమేముంటుంది? నీక ఏ విద్య మీద ఆసక్తి ఉందో అదే నేర్చుకో. మన కర్మ బాగా లేదంటూ జాతకాలని తిట్టుకుంటూ కూర్చోకు.
English:
Don’t blame the elders, the education system and the teachers for your failure in examination due to your laziness. Whatever you are adept at, you learn that. Do not sit at one place blaming the stars for failure. Rise and win!
146.
నీవు బెట్టు ముద్ద నిలువెల్ల దోపిడీ
పరులు యదియె సేయ ఫల మాశి యించి
మత్సరమ్ము వీడి మనసును కడుగరో
వాణి బలుకు మాట నాదు నోట!
తాత్పర్యము (తా):
నువ్వు చేసిన చిన్న దానం కూడా నిలువు దోపిడీ చేసి ఇచ్చినంతగా చెప్పుకుంటావు. అదే ఇతరులు చేస్తే ఏదో ఆశించి చేశారని ప్రచారం చేస్తావు. మాత్సర్యమనే (అసూయ) శత్రువునుజయించి మంచి మనసుతో చూస్తే నిజం బోధ పడుతుంది.
English:
Whatever little charity you do, you speak high of it and say you donated your whole property. If the same is done by others you spread a canard that it was quid pro quo. Leave jealousy aside and see with pure heart.
150.
శీలమన్న నేమి శారీరకమె గాదు
భక్తి శివుని పైన రక్తి ఎటనొ
సూక్తి ముక్టావళియు రిక్తమౌ యట్టిచో
వాణి బలుకు మాట నాదునోట!
తాత్పర్యము (తా):
శీలమనేది కేవలం శారీరకమే కాదు. మన్సు కూడా నిర్మలంగా ఉన్నవాడే శీలవంతుడు. శివ పూజలు చేస్తూ భక్తి ఇక్కడ, రక్తి మాత్రం పరాయి స్త్రీ మీదా అయితే, ఇంకా సూక్తి ముక్తావళి శూన్యమే కదా!
English:
Character is not related to acts of bodily senses. Even heart should be pure. Sitting in a Temple of God, if one’s mind wanders on sensual pleasures, the whole moral lessons are garbage.
161.
నడక నేర్పిన తలి దండ్రి నడక మరచి
కర్ర సాయము తోడను కష్ట పడగ
నీకు సమయము దొరుకదె నడువ తోడు
తేట బలికెను ఈ బాణి నాదు వాణి!
తాత్పర్యము (తా):
నీకు నడక నేర్పిన తల్లి,దండ్రులు వయసు మీరి నడక మరచి పోయి కర్ర సాయంతో నడుస్తుంటే, కనీసం తోడుగా వెళ్ళడానికి కాసింత సమయం నీకు దొరకదా?
English:
When the parents, that taught you to walk, are walking with the help of a stick, do you not find a little time at least to go with them?
173.
విజయ మనగ కాదు వారధి ముందుకు
శిరము వంచగ నదియె శాప మగునె
ధైర్య మున్న వేళ దేవుడుండును తోడు
వాణి బలుకు మాట నాదు నోట!
తాత్పర్యము (తా):
విజయం సాధించంగానే మన గొప్పతనమని విర్రవీగాల్సిన అవసరం లేదు. అది ముందుకు పొయ్యే వారధిగానూ భావించ రాదు. అపజయమూ శాపం కాదు. శిరసు వంచి నడవడంలో సిగ్గు పడాల్సిందేమీ లేదు.విజయంలో కానీ, అపజయంలో కానీ దేవుడ్ని తోడు చేసుకు నడవడం ప్రధానం.
English:
Success is not a bridge that takes you forward. No need to stretch your chest and boast. So too, defeat is not end of road. There is nothing wrong in kneeling your head a few moments. Whether in success or failure, take God along!
174.
ధైర్య మనిన ఎదురు బలుకుట కాదొకో
ఆగి వినుము పరులు యాడు నుడివి
వారి మాట లౌగ వారధి ముందుకు
వాణి బలుకు మాట నాదు నోట!
తాత్పర్యము (తా):
ఎదుటి వారి మాట వినకుండా మనం చెప్పిందే సరి అని ముందుకు నడవడం పద్ధతి కాదు. ఒక్కో సారి వారి మాటలు నీ విజయ పధానికి వారధి అవ్వొచ్చు.
English:
It is not courage to walk past others’ words thinking what we do is right. Sometimes the words of advice by others may act as bridge to your path of success.
193.
భామ దొరుకక తలడిల్లె బ్రహ్మచారి
భార్య కావలెనంచును బ్రకటనిచ్చె
ఆడ మగవారి నిష్పత్తి యడ్డు తగిలె
తేట బలికెను ఈ బాణి నాదు వాణి!
తాత్పర్యము (తా):
భార్య కావాలని బ్రహ్మచారి ప్రకటనిస్తే, భార్య కావద్దానికి ఆడ పిల్లలేరి. వారిని పుట్టనిస్తే కదా? బ్ర్హ్మచారి ఎంత తల్లడిల్లినా ఆడ-మగ నిష్పత్తి అడ్డమొచ్చె కదా?
English:
Bachelor gave an advertisement for an eligible wife. Where are girls to marry? They were not allowed to be born. Howsoever he stuggles the ratio of men and women came in the way.
197.
బడులు తెరువ బాల బ్రహ్మలు కదిలిరి
వాణి వెదుక యందున వాసి గాను
ఙాన తృష్ణ తోడ ఙానుల చెంతకు
వాణి బలికెను ఈ మాట నాదు నోట!
తాత్పర్యము (తా):
ఈ పద్యం మా మనవడిని బడిలో దించి అక్కడే కూర్చున్నప్పుడు వ్రాసినది. బడులు తెరవగగానే, బాల బ్రహ్మలు కదిలివచ్చారు. బడిలో ఉన్న తమ వాణిని (సరస్వతీ దేవిని) వెదుక్కుంటూ. విఙానాన్ని కూడగట్టుకోడానికి ఙానుల (ఉపాధ్యాయినుల) వద్దకు.
English:
I wrote this poem when I dropped my 2.5 yr old grandson in school and was waiting for him outside, inspired by the flow of small kids.
The kid Brahmas came in search of their Vanis (Sarasvati Devi) in the school. They came with an urge to attain knowledge from the knowledgeable.