The following Poem was composed by budding Twitter Kavi, K.Chandrasekhar.

With the approach of Maha Siva Ratri, an original Telugu Poem of the bhakti geya type by Kondubhotla, Chandrasekhara garu.
గుంటూరు జిల్లా, నరసరావు పేట దగ్గర కోటప్ప కొండ పైన వెలసిన శ్రీ త్రికూటేశ్వర స్వామివారికి మహా శివరాత్రి సందర్భంగా, భక్తితో
కోటప్ప కొండ త్రికూటేశ్వర
§
కోటప్పకొండపై
కోటి వ్రేల్పుల రేడు
కోటయ్య యని మ్రొక్క
చేదుకొను హరుడు
§
ఏమన్న ప్రభలు నవి ఎంత జాతరలు
త్రికూట రాయుడికి కోటి దండాలు
వేయి సంబారాలు వేవేల పూజలు
కోటి ప్రభలా వేల్పు మేలు సల్పు
§
శివుడె దిక్కని మ్రొక్క నొక్క గొల్ల వారింట
వరపుత్రి వెలసె ఆనందవల్లి యను పేరిట
బాల మనమున యెపుడు బాలేందుడే యగుట
ముక్కంటికే తన్ను తాను అర్పితమంట
§
ఆది జంగమ దాహమ్ము దీర్పంగ
చెలమ నీరే ఆమె కడవ నింపంగ
శంభు తలపై గంగ విస్తుబోవంగ
భక్తి భావనకి యా ముక్కంటి లొంగంగ
§
కొండ చేరెడు వేళ కాళ్ళు నొవ్వగరాగ
కడవ నీరొక తాన తాను పండె వేరొక తాన
పాపమా కాకమా కడవపై వ్రాలంగ
కుండ దొణికెను నీరు మ్రొక్కవోవంగ
§
కుపిత ఆనంది ఆ గొల్లలింటి చాన
కొండ వ్రాలకు నీవు మరల రాకను యెడల
నాటి కాలము దాటి నేటికబ్బురమెంత
కోటప్ప కొండపై కాకి వాలదు వింత

గొల్ దెచ్చెను పాలు
నెలలు నిండిన చూలు
కొండ దిగవలె శూలి
తా తిరిగి జూడదు మరలి
§
అయ్య వేసిన అడుగు
ఘన ఓంకార నాదమ్ము
భీత* హరిణయి గైత
తల ద్రిప్ప బొమ్మయె వింత
§
అచటె ఆగెను భవుడు
రాతి బొమ్మయి నిలుడు
భక్త సులభుండతడు
పరమేష్ఠి యతడు
§
అడగకిచ్చును వరము
అడుగుటెవ్వని తరము
ఇహము నుండీ పరము
శివుడె మోక్ష మార్గమ్ము
§
సత్యమనగా శివుడు
శివమన్నదే వాడు
సుందరమ్మగు హరుడు
త్రికూటాద్రి విభుడు
§
ఫ్రణవ నాదమె వాడు
ఆది గురువని చూడు
సృష్ఠి స్ఠితియును లయుడు
త్రికూటాద్రి విభుడు
§